Tuesday 30 August 2016

అనుభందాల సుమాలు

అనుబంధాల సుమాలు

శోదించకు నీ జన్మకు కారణాన్ని,పరిశోదించు నీ జన్మకు సార్ధకతను ;
అందించే చేయి కోసం ఎదురుచూడకు,వేచి ఉన్నవారికి అందించు నీ అభయహస్తాన్ని ;
వాల్చే శిరస్సులు ఎన్ని ఉన్నా,ఓదార్చే భుజము నీదే కావాలి;
స్మరించు మదర్ థెరీసా సేవను,అందించు అలానే నీవు కూడా సేవలు;
పగ ప్రతీకార జ్వాలాల నడుమ అనుబంధాల సుమాలు కురిపించు ;
అంతరించిపోతున్న ప్రాచీన సాంస్కృతిక ,సాంప్రదాయాల వైభవాన్ని గుభాళింపజేయు ;
గతమన్నది నీకు అనుభవం ,వర్తమానానికి విధ్యార్ధివి ,భవిష్యత్తుకి సూత్రధారివి;
గుర్తించు ,ఎందరో పుణ్యమూర్తులను కన్న ఈ భరతభూమికి ,నీ జననానికి ఉన్న అనుబంధాన్ని ;
గర్వించు ఈ పుణ్యభూమి లో నీ జననానికి ;
నిలవాలి చిరస్థాయిగా అందరి హృదయాలలో నీవు, ఇదే నా అభిలాష.

ఈ కవిత సాహితీ కిరాణం అనే మాస పత్రికలో ప్రచురితమయ్యింది .ఆగస్టు 2016

లేఖ

చిన్ననాటి స్నేహితురాలికి లేఖ
                                                                                                                      తారీఖు
                                                                                                                      శ్రీకాకుళము.
నా ప్రియ సఖి ,ఇష్ట సఖి ,ప్రాణ సఖి అయిన పూర్ణిమకు,
                                  నీ స్నేహితురాలు ప్రవీణ వ్రాయు లేఖ. ఉభయ కుశలోపరి. నిన్ను చూడాలని, నీతోమన చిన్ననాటి  ముచ్చట్లు పంచుకోవాలని నా మనస్సు ఉవ్విళ్లూరుతుంది. నీకు మన పాఠశాలలో మనము గడిపిన ఆ మధురమైన రోజులు గుర్తున్నాయా............,నాకు ఇప్పటికీ ఆ దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతున్నవి .
             అవి శ్రీకాకుళము  విశాలాంధ్ర చిల్డ్రన్ స్కూల్ లో చదువుకునే రోజులు. నేను నా చదువును అక్కడే ప్రారంభించాను. చదువు,స్నేహితులు,పాఠశాల అంతా బాగున్నా ఏదో వెలితిగా అనిపించేది. స్నేహితులు ఉన్నా నాతో చదువులో పోటీ పడేవారే తప్పా ,నా మనసెరిగి నా భావాలను పంచుకునే స్నేహితురాలు ఎవరూ లేక మదనపడుతున్న తరుణములో నాకు ఒక దేవదూతలా నువ్వు [పూర్ణిమ] తారసపడ్డావు.నా ప్రియ సఖివైనావు,నా చేయి పట్టుకున్నావు,నన్ను సన్మార్గములో నడిపించావు,నీవు పలికిన మెత్తని కుసుమాల వంటి వాక్కులు నామదిని  ఉల్లాసపరిచాయి.నా కష్టసుఖాలలో సగభాగం పంచుకున్నావు. మన స్నేహాన్ని చూసి ఓర్వలేని ఎందరో మన స్నేహాన్ని చెదరగొట్టడానికి ప్రయత్నించి విఫలులు అయ్యారు.పాఠశాల వార్షికోత్సవము నాడు మనము ప్రదర్శించిన నాట్యాలు,ఆటల పోటీలలో మనము గెలుచుకున్న పుస్తకాలు అన్నీ నాకు గుర్తున్నాయి.పరీక్షల సమయములో టీచరుకి కనబడకున్నా కాపీ కొట్టడానికి మనము పడిన అగచాట్లు గుర్తుకొస్తే నవ్వు వస్తుంది ఇప్పుడు.మధ్యాహ్న భోజనములో మీ అమ్మ చేసిన నువ్వుల పొడుము నేను,మా అమ్మ చేసిన చల్లపిప్పి నువ్వు భలేగా  తినేవాల్లము కదా!.నీ రిక్షా వచ్చేవరకు నీకు నేను తోడుగా ఉండేదాన్ని.అప్పుడప్పుడు మనిద్దరము కలిసి మీ నాన్న గారు పని చేస్తున్న బ్యాంక్ కి వెళ్ళి చల్లటి నీళ్ళు తాగే వాల్లము. ఇద్దరిలో ఎవరు పాఠశాలకి రాకపోయిన ఇద్దరూ తల్లడిల్లే   వాల్లము.నాకు నువ్వు లెక్కలు నేర్పేదానివి ,నేను నీకు సైన్స్ నేర్పించేదాన్ని.ఇలా మనము సంతోషముగా గడుపుతున్న సమయమున, మనసు లేని ఆ దేవుడు మన ఆనందాన్ని చెదరగొట్టలేక మనల్ని వేరు చేశాడు.మీ నాన్నగారికి రాజమండ్రి కి బదిలీ అయ్యింది. చెరొక  వైపు చేరినాము. మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లొపోయావు.నేను నా పదవతరగతి వరకు అక్కడే చదివాను. మనము విడిపోయినా, ఉత్తరాల ద్వారా కలుసుకునే ఉందామని బాసలు చేసుకున్నాము.
            నాకు పెళ్లి జరిగిన వరకు మనము ఉత్తర,ప్రత్యుత్తరాలు కొనసాగించాము. “నీ పెళ్ళికి రాలేకపోతున్నందుకు నన్ను క్షమించు” అని ఉత్తరము వ్రాసావు. అదే నీ నుండి నాకు అందిన చివరి లేఖ. ఆతరువాత ఎన్ని లేఖలు వ్రాసినా నీ వద్ద నుండి జవాబు లేదు,ఏమయిపోయావు పూర్ణి! నీ చిరునామా కోసము ఎంతగానో ప్రయత్నించాను.లేఖల ద్వారా,ఫోన్ల ద్వారా,స్నేహితుల ద్వారా ఇలా రకరకాలుగా ప్రయత్నించి అలసి పోయాను.చివరికి ఫేస్ బుక్ లోను ప్రయత్నించాను. అందులో నీ పేరుతో రెండు వేలమంది ఉన్నారు. అన్నీ ఓపికగగా,ఎంతో ఆశ గా వెతికాను. కానీ నా ఆశ అడియాస అయ్యింది. నీ జాడ తెలియలేదు.అలసిపోయాను పూర్ణి.చివరగా ప్రతిలిపి.కాం ద్వారా,బాబు కోయిలాడ గారి ద్వారా నీ ఆచూకీ తెలుసుకుని నిన్ను చేరుకోవచ్చనే ప్రగాడమైన నమ్మకం,విశ్వాసము,ఆశయము ద్వారా ఆశగా,ఆతృతగా ఈ లేఖను వ్రాస్తున్నాను.ఈ లేఖని చదివి నీవు ఎక్కడున్నా నన్ను కలుస్తావని నా కను చివరల దాగి ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకు మిత్రమా!
                                                                                                   ఇట్లు
                                                                       నీకోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న నీ ప్రియ సఖి
                                                                                             ప్రవీణ.

  
                                                                                               

ప్రతిలిపి వారు నిర్వహించిన లేఖల పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న లేఖ

Saturday 30 July 2016

ఆశ

ఆశ   
            నేను పుట్టగానే మా అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిదురించిన అలనాటి ఆ అనుభూతిని పొందాలని ఆశ
            మా అమ్మ ప్రేమగా తన ఒడిలోకి తీసుకుని తొలిసారిగా నన్ను ముద్దాడిన  ఆ చుంభన స్పర్శ పొందాలని ఆశ
             తను తండ్రి అయిన గర్వాన లాలనగా నన్ను తన చేతులలోకి తీసుకుని నా నుదుటన తొలి చుంభన చేసిన                                ఆ దృశ్యము చూడాలని ఆశ    
నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలియక కంగారు పడిన మా అమ్మానాన్నల తపన చూడాలని ఆశ
నన్ను ఎత్తుకుని చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించిన అమ్మ చేతి కమ్మదనాన్ని ఆస్వాదించాలని ఆశ
తన భుజము మీద నన్ను నిద్రబుచ్చుతూ తనూ నిద్రలోకి జారుతున్న మా నాన్న చేతి లాలన పొందాలని ఆశ
తప్పటడుగులు వేస్తూ వడివడిగా పడుతూ లేస్తూ ఉన్న ఆనిమిషాన మా అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని ఆశ
ముద్దుముద్దుగా నేను పలికే తొలి పలుకులను వింటున్న నాన్న ఆసక్తి ని చూడాలని ఆశ
జ్వరమొస్తే కంగారుగా డాక్టరు దగ్గరకు పరుగెత్తి నన్ను కోలుకునేటట్లు చేయమని డాక్టరు ని ప్రాదేయపడుతున్న నాన్న వేధన చూడాలని ఆశ
అక్షరాభ్యాసము రోజున నాన్న ఒడిలో కూర్చుని తన చేతితో ఓంకారాన్ని చుడుతున్న ఆ శుభతరుణాన్ని వీక్షించాలని ఆశ
ఇటువంటి ఎన్నో తిరిగిరాని మరపురాని  అనుభూతులను   మళ్ళీ పొందాలని ఆశ.   
                                     

ఈ కవిత సిరిమల్లె పత్రికలో జూలై 2016 నా ప్రచురితమయ్యింది

Tuesday 17 May 2016

చూపులు

చూపులు
తొలి చూపులో నిను నేను సరిగా చూడలేదు ,   
మలి చూపులో చూద్దామని కనుపాప కదిపితే నీవు నన్నే చూస్తున్నావు,
నును సిగ్గుతో తల దించాను,
నీ సమ్మోహనశక్తి నా మనసుని ఆకర్షించింది ,
స్థిర ముద్ర పడింది,
ఏది చూసినా,ఎటువైపు చూసినా నీవే,ఎదంతా నీవే,
చిరు చూపుతో చేసుకున్నావు,నా హృదయాన్ని సొంతం.
అభినయ నయనాల సోయగాడ ,
చిరుచూపు ముసిముసి జల్లువాన కురిపించావు,
నా  ఎద తడిసింది ఆ వానలో,
నీ త్వరితానికి తబ్బిబ్బింది నా స్వాంతనము,
  నీ   నగుమోము ,చిరుదరహాసం,
ఉప్పొంగించింది  నా మనసును,
నాలో రేగే భావాల ఆనకట్టవు నీవు,
నా ఆశల కెరటాలలను దరిచేర్చుకునే ఒడ్డువి నీవు,
నీవు ఎదుట పడితే నా మది లయ తప్పుతుంది
నీవు కనుమరుగైతే నా కలము కదలదు
నీ ఆశాకుసుమాల మాలలో నేను దారమవుతాను,
నీ వేణువులో రాగాన్నై ఉప్పొంగుతాను,
నీ నయనాలలో దీపాన్నై వెలుగుతాను,
నీ హృదయములో శ్వాసనై నిలుస్తాను,
నీ అడుగులో అడుగునై నడుస్తాను,
మన ఊహల సరిగమల పల్లకిని పదనిసల శ్రీకారం చేద్దాము

ఈ కవిత సుజనరంజని అనే అంతర్జాల పత్రికలో ప్రచురింపబడింది మే 2016 సంచికలో

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may2016/kavitha3.html

Sunday 8 May 2016

Amma

అమ్మ
ఏమని  ఎలా వర్ణించను అమ్మ నిన్ను ,కవులు నాకు ఏ పదము విడువలేదు నిన్ను వర్ణించడానికి ,నా ఊపిరి ఉన్నంతవరకు నా ఉచ్వాస ,నిశ్వాస లలో నిన్నే తలుస్తాను ,ఇది ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అపురూపమైన కానుక .
ప్రవీణ

Friday 25 March 2016

నాన్న

నాన్న
అమ్మ అనే రెండక్షరాల కమ్మని పిలుపులో అనురాగము ఉంది,
నాన్న అనే రెండక్షరాల పిలుపులో నాది అనే అధికారం ఉంది ,
అప్పటివరకు అమ్మకే పరిమితమైన నాన్న ప్రేమ ,
నేను పుట్టగానే నా సొంతమయింది,
తన తల్లిని ,తన కూతురి లో చూసుకొని మురిసిపోయే ,అల్ప సంతోషి నాన్న,
బంధాలను,అనుబంధాలను సమతూకముగా నిలబెట్టే ప్రజ్ఞాశీలుడు నాన్న,
జన్మతహ నాన్న,విజ్ఞతహ గురువు,కౌమారతహ స్నేహితుడు ‘’నాన్న’’,
బార్య బిడ్డల కొరకు అలుపెరుగక అహర్నిసలు శ్రమిస్తారు నాన్న,
తన బిడ్డలకు మంచి ఆదర్శ వ్యక్తి నాన్న,
కూతురు నాన్న లాంటి భర్తను కోరుకునేంత ఉన్నత భావాలు కల వ్యక్తి నాన్న,
నాన్న అనే పిలుపు తప్ప ఏమీ ఇవ్వలేని మాకోసం,
తన జీవితన్నే ధారపోసిన మహోన్నత వ్యక్తి నాన్న,
భగవద్గీతలో గీతోపదేశం అర్జునుడికి ఎటువంటిదో,
జీవితంలో అన్ని సమయాలలో ,అంతటి మహత్తరమైనవి నాన్న పలుకులు,
నాన్న రక్షణ,కర్ణుడి కవచకుండలాలు లాంటివి,
ఇవ్వడమే తప్ప ఏమి ఆశించని నిస్వార్దపరుడు నాన్న,
ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని ఋణం ‘’నాన్న ప్రేమ ‘’.                                                                    *******************                                           
ఈ కవిత అచ్చంగా తెలుగు అనే పత్రికలో ప్రచురింపబడింది ,మార్చి 23, 2016 సంచికలో                                                       http://acchamgatelugu.com/%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-2

Wednesday 9 March 2016

అర్దరాత్రి

అర్దరాత్రి
ఒకప్పుడు ఎంతో ప్రశాంతముగా ఉండేది ,
ఎంతో ఆనందముగా ఉండేది ,
ఏకాంతముగా ఉండేది ,నిశ్శబ్దముగా ఉండేది,
సూది పడినా ఉలిక్కిపడేది ,
తనని తాను తలచుకొని గర్వపడేది ,
తనంత అదృష్టవంతురాలు ఎవరులేరనుకునేది ,
తాను మాత్రమే కాక అందరికీ ప్రశాంతతను,ఆరోగ్యాన్ని ఇస్తున్నానని తనలో తానే సంతోష పడేది ,
కాని ఆ అర్దరాత్రికే దిష్టి తగిలింది ,
ఆ ఆనందము,ఏకాంతము,ప్రశాంతత అన్నీ మాయమయిపోయాయి ,
షికారు కోసం  పాపం, రోడ్డు మీదకి వెళ్లింది అర్దరాత్రి ;అక్కడ వాహనాల హోరు,కుక్కల అరుపులు,
పరుగెత్తుకొని ఒక ఇంట్లో దూరింది,అక్కడ మొబైల్ ఫోన్ల మెసేజెల కిచకిచలు ,మాటలు.
పక్కన బార్యభర్తల మద్య ప్రశాంతత వెతుక్కుంది ,కానీ అక్కడ గొడవలే ;పొలాల వైపు పరుగెత్తింది ,అక్కడ నీళ్ళ మోటర్ల శబ్దాలు,
లాభం లేదని ,ఎత్తయిన భవనాల వైపు పరుగు తీసింది ;అక్కడ సెల్ టవర్ల వైబ్రేషన్లు ,బార్లలోన ,క్లబ్బులలోన ,ఇలా ఎక్కడ చూసినా శబ్దాలే ,అర్దరాత్రికి నిశ్శబ్దమే కరువయ్యింది.
అరణ్యానికి వెళ్లింది, అక్కడ మానవుడు చెట్టులు ,కొండలు కొట్టి బిల్డింగులు కట్టేశాడు.
అర్దరాత్రి దిగులు పడింది ,తనకి రోజులు అయిపోయాయని ,మౌనము గా ఈ దేశాన్ని వదిలి దూరముగా వెలిపోదామని అనుకుంది, వెళ్లిపోయింది మనందరిని వదిలి,కాదు మనమే దూరం చేసుకున్నాము,అర్దరాత్రిని,నిశ్శబ్దాన్ని,ప్రశాంతమయిన నిద్రను ,జీవితాన్ని........                      *****************

ఈ కవిత సుజనరంజని అనే అంతర్జాల పత్రిక లో ప్రచురింపబడినది ,మార్చి 2016 సంచికలో

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/march16/

Wednesday 3 February 2016

వెలుగు

వెలుగు

ఓ అద్వితీయ జీవిత బాటసారి;
నా తోడు నీవే, నీవే నా జీవిత గమ్యగానివి;
నీ ప్రతీ క్షణ లోటు నాకు యుగాందకారము ;
తెలియక నీయెడల తప్పునకు మౌనః శిక్ష వేయకు;
నా జీవిత సర్వసకల సిద్దహస్తురాలువు నీవు;
నీ  జీవితము అనన్యమైనది;
వద్దన్నా గుమిగూడే స్నేహితులు;
సర్వ ప్రపంచము నీ సొంతము .

Tuesday 2 February 2016

మా స్నేహం

మా స్నేహం
సూర్యుడి ‘’కిరాణా’’లు సోకిసోకగానే,
వికసించిన ‘’పధ్మ’’ము మన స్నేహము,
అపుడే పూచిన ‘’రోజా’’ పూలతో ,ఆ’’లక్ష్మి’’ని పూజించి,
కోటి రాగాలతో ‘’వీణ’’ను మీటగా వచ్చే,
నవ్వుల ‘’శిరి’’యే మన స్నేహ’’షాలిని’’,
గలగలా పారే గోదావరిని,
జలజల సాగే మన స్నేహాన్ని ,
ఎవరూ ఆపలేరు .

అభివందనములు

అభివందనములు
వెలిగారు మణిపూసగా ఈ అసంఖ్యాక జనవాహినిలో ,
చేరాయి విధార్ది బిందువులు మీ చుట్టూ ,
నా అదృష్టము మీ విధ్యావాహినిలో నేనొక బిందువునయ్యాను ,
మీ సేవ మా కొరకై అనంతమైనది ,
మీ కృషి తో నా కృషిని కలిపి సహకరిస్తాను ,
జన్మజన్మలకు మాకు గురువు మీరే ,
మీ విధ్యా సేవకు నా అభివందనములు .

Friday 29 January 2016

కీర్తి

కీర్తి
మీ అనంత విధ్యావాహిని లో ,
రేణువైన నన్ను దరిచేర్చుకునే ,
మీ హృదయాన్ని కీర్తించుటలో
వణికింది నా కలము,
శూన్య ధైర్యముతో మీ మోమును ,
తిలకించుటలో చెమ్మగిల్లాయి నా కనులు.