Tuesday 17 May 2016

చూపులు

చూపులు
తొలి చూపులో నిను నేను సరిగా చూడలేదు ,   
మలి చూపులో చూద్దామని కనుపాప కదిపితే నీవు నన్నే చూస్తున్నావు,
నును సిగ్గుతో తల దించాను,
నీ సమ్మోహనశక్తి నా మనసుని ఆకర్షించింది ,
స్థిర ముద్ర పడింది,
ఏది చూసినా,ఎటువైపు చూసినా నీవే,ఎదంతా నీవే,
చిరు చూపుతో చేసుకున్నావు,నా హృదయాన్ని సొంతం.
అభినయ నయనాల సోయగాడ ,
చిరుచూపు ముసిముసి జల్లువాన కురిపించావు,
నా  ఎద తడిసింది ఆ వానలో,
నీ త్వరితానికి తబ్బిబ్బింది నా స్వాంతనము,
  నీ   నగుమోము ,చిరుదరహాసం,
ఉప్పొంగించింది  నా మనసును,
నాలో రేగే భావాల ఆనకట్టవు నీవు,
నా ఆశల కెరటాలలను దరిచేర్చుకునే ఒడ్డువి నీవు,
నీవు ఎదుట పడితే నా మది లయ తప్పుతుంది
నీవు కనుమరుగైతే నా కలము కదలదు
నీ ఆశాకుసుమాల మాలలో నేను దారమవుతాను,
నీ వేణువులో రాగాన్నై ఉప్పొంగుతాను,
నీ నయనాలలో దీపాన్నై వెలుగుతాను,
నీ హృదయములో శ్వాసనై నిలుస్తాను,
నీ అడుగులో అడుగునై నడుస్తాను,
మన ఊహల సరిగమల పల్లకిని పదనిసల శ్రీకారం చేద్దాము

ఈ కవిత సుజనరంజని అనే అంతర్జాల పత్రికలో ప్రచురింపబడింది మే 2016 సంచికలో

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may2016/kavitha3.html

Sunday 8 May 2016

Amma

అమ్మ
ఏమని  ఎలా వర్ణించను అమ్మ నిన్ను ,కవులు నాకు ఏ పదము విడువలేదు నిన్ను వర్ణించడానికి ,నా ఊపిరి ఉన్నంతవరకు నా ఉచ్వాస ,నిశ్వాస లలో నిన్నే తలుస్తాను ,ఇది ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అపురూపమైన కానుక .
ప్రవీణ