Saturday 30 July 2016

ఆశ

ఆశ   
            నేను పుట్టగానే మా అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిదురించిన అలనాటి ఆ అనుభూతిని పొందాలని ఆశ
            మా అమ్మ ప్రేమగా తన ఒడిలోకి తీసుకుని తొలిసారిగా నన్ను ముద్దాడిన  ఆ చుంభన స్పర్శ పొందాలని ఆశ
             తను తండ్రి అయిన గర్వాన లాలనగా నన్ను తన చేతులలోకి తీసుకుని నా నుదుటన తొలి చుంభన చేసిన                                ఆ దృశ్యము చూడాలని ఆశ    
నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలియక కంగారు పడిన మా అమ్మానాన్నల తపన చూడాలని ఆశ
నన్ను ఎత్తుకుని చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించిన అమ్మ చేతి కమ్మదనాన్ని ఆస్వాదించాలని ఆశ
తన భుజము మీద నన్ను నిద్రబుచ్చుతూ తనూ నిద్రలోకి జారుతున్న మా నాన్న చేతి లాలన పొందాలని ఆశ
తప్పటడుగులు వేస్తూ వడివడిగా పడుతూ లేస్తూ ఉన్న ఆనిమిషాన మా అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని ఆశ
ముద్దుముద్దుగా నేను పలికే తొలి పలుకులను వింటున్న నాన్న ఆసక్తి ని చూడాలని ఆశ
జ్వరమొస్తే కంగారుగా డాక్టరు దగ్గరకు పరుగెత్తి నన్ను కోలుకునేటట్లు చేయమని డాక్టరు ని ప్రాదేయపడుతున్న నాన్న వేధన చూడాలని ఆశ
అక్షరాభ్యాసము రోజున నాన్న ఒడిలో కూర్చుని తన చేతితో ఓంకారాన్ని చుడుతున్న ఆ శుభతరుణాన్ని వీక్షించాలని ఆశ
ఇటువంటి ఎన్నో తిరిగిరాని మరపురాని  అనుభూతులను   మళ్ళీ పొందాలని ఆశ.   
                                     

ఈ కవిత సిరిమల్లె పత్రికలో జూలై 2016 నా ప్రచురితమయ్యింది